సిరాన్యూస్, బజార్‌హత్నూర్
జాతర్లలో ఓటేసిన ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్
* పోలింగ్ కేంద్రాల సందర్శన
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ బజార్‌హత్నూర్ మండలంలోని తమ స్వగ్రామమైన జాతర్ల లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా నగేష్ మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రథమ కర్తవ్యమని, ప్రతి ఒక్క భారతీయుడు ఓటు వేయాలని తెలియజేశారు. అనంతరం సోనాల గ్రామములో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.