సిరా న్యూస్, తలమడుగు:
పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు ఖాయం: గోడం నగేష్
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశవా్యాప్తంగా బిజెపికి 400కు పైగా ఎంపీ సీట్లు రావడం ఖాయమని ఆదిలాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి గుడం నగేష్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని హరి గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. గత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమపథకాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో ముడిపడి ఉన్నవేనని ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. సంస్కృతి కి, సాంప్రదాయాలకు నిలయమైన దేశం భారతదేశమని అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకు బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. రాముడి అక్షింతలతో మనందరి జీవితాలు సార్ధకమయ్యాయని, రాముడి గుడి కట్టి అందరికి అక్షింతలు పంపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ఓటు వేసి కృతజ్ఞత తెలపాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి, పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ లో జెండా ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతాంగే బ్రహ్మానంద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, రైల్వే బోర్డు సభ్యులు జీవి రమణ, పార్లమెంట్ కో కన్వీనర్ మయూర్ చంద్ర, తాంసి జడ్పీటీసి రాజు, బీజేపీ మండల అధ్యక్షులు, వివిధ పదాధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..