సిరా న్యూస్,హైదరాబాద్;
గోదావరిఖని సింగరేణి క్వాటర్ల కూల్చివేత బాధితులు మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అరాచక పాలన చేస్తున్నాడని ప్లకార్డులు ప్రదర్శించారు. గోదావరిఖని లక్ష్మి నగర్ షాపింగ్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ అంటూ సింగరేణి క్వాటర్లు కూల్చివేశారనీ కేటీఆర్ కు మొరపెట్టుకున్నారు. 82 క్వాటర్ల కు కరెంట్, నీళ్ళు కట్ చేసి ఇబ్బందులకు గురి చేసి క్వాటర్లు కూల్చివేసారని అన్నారు.
మాకు జరిగిన అన్యాయం పై అసెంబ్లీలో చర్చించాలని కేటీఆర్ ను వేడుకున్నారు. అందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. గతంలో 70 యేండ్లలో ఏ ప్రజా ప్రతినిధులు ఇలాంటి పనులు చేయలేదనీ బాధితుల అవేదన వ్యక్తం చేసారు.