సిరా న్యూస్, చిగురుమామిడి:
వైభవంగా కళ్యాణ మహోత్సవం…
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలోని కోర మీసాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసంలో భాగంగా ఆదివారం వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ గోదాదేవి, రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందుర్తి గ్రామంలో సైతం హరి హర క్షేత్రంలో గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలను వేద పండితులు గుజ్జ రాజన్న కిరణ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మంటపం వద్ద స్వామి వారి ఉత్సవ విగ్రహాలను నూతన వస్త్రాలతో అలంకరించి, కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దీంతో గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవతోపాటు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆచరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గందే సంపత్ కుమార్, ఆలయ జూనియర్ అసిస్టెంట్ బూట్ల కవిత, ధర్మకర్తలు గుండె కారి మాధవ్, గొల్లబత్తిని మహేష్, తాళ్ల పెళ్లి కిరణ్ కుమార్, శ్రీ మూర్తి శ్రీనివాస్, మంతెన మహేందర్, బొల్లం వెంకటలక్ష్మీ, ఆలయ మాజీ చైర్మన్లు కంది తిరుపతిరెడ్డి, తాళ్లపల్లి రాజయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.