సిరా న్యూస్, చిగురుమామిడి
బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా గొడిశాల సుభాష్ గౌడ్
* నియామక పత్రాన్ని అందజేసిన జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏఎస్సై గొడిశాల సుభాష్ గౌడ్ నియమితులయ్యారు. గురువారం కరీంనగర్ లో జరిగిన బిసీ సంక్షేమ సంఘం సమావేశంలో సుభాష్ గౌడ్ కు నియమాకపత్రాన్ని సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్నం ప్రకాష్, రాష్ట్ర ప్రచారకార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ చేతుల మీదుగా అందజేశారు. నూతనంగా నియమితులైన జిల్లా ఉపాధ్యక్షుడు గొడిశాల సుభాష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి బీసీ సంక్షేమ సంఘం బలోపేతానికి తనవంతుగా కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకంతో పదవి ఇచ్చినందుకు జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎన్నం ప్రకాష్, నాగుల కనకయ్య, నా పదవికి ప్రత్యక్షంగా సహకరించిన రాష్ట్ర ప్రచారకార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్ నేత నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్, మండల అధ్యక్షుడు శ్రీరామోజు రాజ్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ మండల యూత్ అధ్యక్షుడు మోర ప్రవీణ్ కుమార్, మండల గౌడ సంఘం అధ్యక్షుడు బొమ్మగాని వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.