హై జంప్ చేస్తున్న బంగారం, వెండి

సిరా న్యూస్;
ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి, ప్రతి రోజూ కొత్త గరిష్టాన్ని తాకుతున్నాయి. వెండి కూడా వేగంగా పెరుగుతోంది, రికార్డ్‌ స్థాయికి చేరింది. ఎల్లో మెటల్‌, సిల్వర్‌ మెరుపుల వెనుక చాలా కారణాలున్నాయి. వెండి కిలో లక్ష రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్‌ల అంచనా.స్థూల ఆర్థిక కారణాలతో పాటు, ప్రపంచంలోని కొన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధాలు బంగారం, వెండి ధరల ర్యాలీకి కారణంగా మారాయి. ముఖ్యంగా, యూఎస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ తీసుకునే నిర్ణయాలు, చేసే కామెంట్లు స్వర్ణం, రజతం రేట్లను బలంగా ప్రభావితం చేస్తున్నాయి. అమెరికాలో, ఈ క్యాలెండర్‌ సంవత్సరంలో 3 దఫాలుగా వడ్డీ రేట్లు తగ్గుతాయని యూఎస్‌ ఫెడ్‌ ఛైర్‌ జెరోమ్‌ పావెల్‌ ఇటీవల హింట్‌ ఇచ్చారు. దీంతో, గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ట్రెజరీ బాండ్లు, ఇతర గవర్నమెంట్‌ సెక్యూరిటీల నుంచి డబ్బు వెనక్కు తీసుకుని పసిడిలోకి పంప్‌ చేస్తున్నారు. ఇదే కారణం వల్ల వెండి కూడా లాభపడుతోంది. 2023లో బంగారం ధరలు దాదాపు 13 శాతం పెరిగాయి. వెండి ధర సుమారు 7.19 శాతం పెరిగింది. 2024 డేటాను పరిశీలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్ 08 వరకు, సిల్వర్ సుమారు 11 శాతం పెరిగింది, గోల్డ్‌ దాదాపు 15 శాతం జంప్‌ చేసింది.పసిడి, వెండి మార్కెట్‌లో కనిపిస్తున్న ఈ వేగం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ చెప్పింది. భవిష్యత్‌లో వెండి కిలోకు రూ.92 వేల నుంచి రూ.లక్ష వరకు చేరవచ్చని లెక్కగట్టింది.స్పాట్‌ రేట్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,400 వరకు పలుకుతోంది. కిలో వెండి రేటు ₹ 85,000 గా ఉంది.ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ పెట్టుబడిదార్లను రక్షణాత్మక వైఖరి వైపు నెడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో వేగం తగ్గడంతో… తమ దేశాల మీద ఆ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి వివిధ కేంద్ర బ్యాంక్‌లు భారీ స్థాయిలో బంగారం కొని నిల్వ చేసుకుంటున్నాయి. అందుకే, సేఫ్‌ హెవెన్‌ గోల్డ్‌కు డిమాండ్‌ పెరిగింది. పసిడి కొంటున్న వాళ్లే వెండి మీదా నమ్మకం పెడుతున్నారు. అంతేకాకుండా… దేశీయంగా & అంతర్జాతీయంగా తయారీ రంగం ఊపందుకుంది. తయారీ రంగంలో, ముఖ్యంగా ఆటోమోటివ్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మెడికల్‌ విభాగాల్లో వెండిని విరివిరిగా ఉపయోగిస్తారు. దీనివల్ల కూడా రజతం కొనుగోళ్లు పెరిగాయి. సౌరశక్తికి డిమాండ్ పెరగడం వల్ల కూడా వెండి మెరుపులు పెరిగాయిబంగారం ధరలు పెరిగేందుకు ప్రస్తుతం పలు కారణాలున్నాయి. ప్రధాన కారణం అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడమే. అమెరికా తన మానిటరీ పాలసీని ఈ ఏడాది చివరిలో కాస్త సడలింపు చేస్తుందనే అంచనాలు బంగారం ధరల ర్యాలీకి దోహదం చేశాయి.యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.9 శాతం పెరిగి 2,185.5 డాలర్లను చేరుకున్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన ఈ ధరలు ప్రస్తుతం దేశీయంగా ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, భౌగోళిక రాజకీయ టెన్షన్లతో 2024లో బంగార ధర రూ.70 వేలను తాకుతుందని ఇండస్ట్రీ బాడీ ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూవెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్(జీజేసీ) చెప్పినట్లు ఎకనామిక్ టైమ్స్ ఈ ఏడాది ప్రారంభంలోనే రిపోర్టు చేసింది.ఒకవేళ ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా మారితే, రక్షణాత్మక ఆస్తులకు (డిఫెన్సివ్ అసెట్స్) డిమాండ్ పెరగనుందని జీజేసీ చెప్పినట్లు తన కథనంలో పేర్కొంది. దీంతో అంచనాలకు మించి ధరలు పెరుగుతాయని తెలిపింది.2023లో కూడా 13 శాతం రిటర్నులతో బంగారం అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనం.భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఇళ్లలో జరిగే కార్యక్రమాలలో బంగారం ప్రముఖమైన స్థానాన్ని దక్కించుకుంది.సాధారణంగా భారత్‌లో వార్షిక బంగారు డిమాండ్‌లో సుమారు 50 శాతం పెళ్లిళ్ల నుంచే వస్తుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది. బంగారానికి అతిపెద్ద మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉంటుంది.అయితే, ప్రస్తుతం అత్యధికంగా ఉన్న ధరలతో, జ్యూవెల్లరీ డిమాండ్‌పై ప్రభావం చూపుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన రిపోర్టులో పేర్కొంది. జ్యూవెల్లర్స్ తమ స్టాక్‌ను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అంతేకాక, పెళ్లి వేడుకలకు ముహుర్తాలు కూడా ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కాస్త తక్కువగా ఉన్నాయి. అందుకే, వెడ్డింగ్ రిటైల్ జ్యూవెల్లరీకి కూడా డిమాండ్ తగ్గే అవకాశం ఉందని తన రిపోర్టులో తెలిపింది.మే నెల ప్రారంభంలో అక్షయ తృతీయ వేడుక ఉండటంతో, రిటైల్ జ్యూవెల్లరీ డిమాండ్ కాస్త పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తోంది.ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా కొనే దేశాల్లో చైనా, భారత్ రెండూ కూడా ప్రముఖమైన స్థానాన్నే సంపాదించుకున్నాయి.2023 క్యూ4లో చైనా వద్ద 2,235.39 టన్నుల బంగారు రిజర్వులుంటే, భారత్ వద్ద 803.58 టన్నుల బంగారం నిల్వలున్నాయి. గత ఏడాది చైనా అత్యధికంగా తన బంగారు నిల్వలను పెంచుకుంది.గత ఐదేళ్లుగా భారత్‌లో బంగారం డిమాండ్ 700 నుంచి 800 మెట్రిక్ టన్నుల మధ్య ఉంటుంది.2024లో ఈ రేంజ్‌ను మించి 800 నుంచి 900 టన్నులకు చేరుకుంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియన్ ఆపరేషన్స్ సీఈవో పీఆర్ సోమసుందరమ్ చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *