కర్నూలు జిల్లాలో మరో చోట బంగారు గనులు

సిరా న్యూస్,కర్నూలు;
కర్నూలు జిల్లాలో మరో చోట బంగారు గనులు ఉన్నట్లు శాస్త్ర వేత్తలు గుర్తించారు. ఆలూరు సెగ్మెంట్ లోని అస్పరి మండల పరిధిలో గోల్డ్ నిక్షేపాలున్నట్లు..జీఎస్.ఐ..జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండయా ప్రాథమికంగా గుర్తించారు.
ఈ ప్రాంతంలో బంగారు ఖనిజ నిల్వ పరిమాణం,నాణ్యత, విస్తీర్ణం పై సమగ్ర సర్వే చేయాలని జీ.ఎస్. ఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పత్తికొండ సెగ్మెంట్ పరిధిలోని తుగ్గలి మండలంలో బంగారు గనులపై తవ్వకాలు చేస్తోంది జీఎస్ఐ..ఆస్పరి లో గోల్డ్ నిక్షేపాలపై సర్వే వివరాలను జిల్లా మైనింగ్ అధికారులకు జీఎస్ఐ అధికారులు వివరించారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లోనే ఈ సర్వే ను పూర్తి చేయాలని జీఎస్ఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *