గురువారం మూడో విడత రైతు రుణమాఫీ..!
సిరా న్యూస్,హైదరాబాద్;
ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సవాల్ చేసిన సీఎం రేవంత్, అన్నట్లుగానే గురువారం మూడో విడత రైతు రుణమాఫీ ప్రారంభించనున్నారు. దేశ చరిత్రలోనే 32.50 లక్షల మంది రైతులకు రుణ విమూక్తి కల్పించేందుకు రూ.31 వేల కోట్లు కేటాయించి రికార్డు సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం. మొదటి విడతగా రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న 11,14,412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేసింది.
ఇక రెండో విడత కింద రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణాలు తీసుకున్న దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేసింది. మూడో విడతలో లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ఖమ్మం జిల్లా వైరా మండలంలో ప్రారంభిస్తారు.