Googuda: జులై 7 నుంచి గూగుడులో కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు

సిరాన్యూస్‌, కళ్యాణ్ దుర్గం
జులై 7 నుంచి గూగుడులో కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు

అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడులో శ్రీ కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు 13 రోజుల పాటు జరగనున్నాయి. జులై 7వ తేదీన స్వామి వారి ప్రథమ దర్శనం, 9న అగ్నిగుండం ఏర్పాటు, 10వ తేదీ స్వామివారి నిలుపుట, 12న ఐదవ సరిగెత్తు, 14నచిన్న సరిగెత్తు, 16న పెద్ద సరిగెత్తు, 17న అగ్నిగుండం ప్రవేశం, 19న స్వామి వారి చివరి దర్శనం జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *