సిరాన్యూస్, ఖానాపూర్
యోగా చేసేలా కృషి చేయాలి: బీజేపీ సీనియర్ నేత గోపాల్ రెడ్డి
* బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు
ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడంతో పాటు మరో పది మందితో యోగా చేసేలా కృషి చేయాలని బీజేపీ సీనియర్ నేత గోపాల్ రెడ్డి అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం లో మున్సిపాలిటీ పార్కు లో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూయోగా గొప్పతనాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాటలో నడావాలన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, తొకల బుచ్చన్న, అంకం మహేందర్, దాదే మల్లయ్య, నైని సంతోష్, స్వామి, రమేష్, జీవన్, దేశాయి రాము, పిట్టల భీమన్న, మామిడి అరుణ్ కుమార్, నీలి శ్రీనివాస్, పరమేశ్వర్, చులేటి సంతోష్, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.