సిరా న్యూస్,న్యూఢిల్లీ;
పార్లమెంట్ జీరో అవర్ జరుగుతున్నసమయంలో లోక్‌సభలోకి దూకి కలర్ స్మోక్ ను విసిరిన దుండగుడి వ్యవహారం సంచలనం అవుతోంది. సాగర్ శర్మ అనే ఆ యువకుడు విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకిన తర్వాత ఎంపీల సీట్ల ముందుగాజంప్ చేస్తూ.. హంగామా చేశాడుు. ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న కలర్ స్మోక్ తీసి బయటకు విసిరేశాడు. షాక్‌కు గురైన ఎంపీలు కొంత మంది వెంటనే బయటకు వెళ్లేందుకు పరుగులు పెట్టారు. కానీసభలోనే ఉన్న గోరంట్ మాధవ్ వెంటే ఆ దుండగుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కొద్ది సేపు ప్రయత్నించిన తర్వాత ఆ నిందితుడ్ని పట్టుకున్నాడు. చేతులు వెనక్కు విరిచి పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మాధవ్ ను సహచర ఎంపీలు అభినందించారు. మాధవ్ మాజీ పోలీసు అధికారి. సీఐగా సర్వీసులో ఉండాగనే వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిరాజకీయాల్లోకి వచ్చారు. పోటీ చేసిన మొదటి సారే ఎంపీగా ఎన్నికయ్యారు. వివాదాస్పద ప్రవర్తనకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఆయన ఈ సారి పార్లమెంట్ లో ధైర్య సాహసాలు చూపి అందర్నీ ఆకట్టుకున్నారు.