సిరాన్యూస్, చిగురుమామిడి
గొర్రెను కాపాడబోయి బావిలో పడి గొర్ల కాపరి మృతి
బావిలో పడ్డ తన గొర్రెను రక్షించబోయి ప్రమాదవశాత్తు అదే బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో చోటుచేసుకుంది.చిగురు మామిడి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రేకొండ గ్రామానికి చెందిన మొగిలి బొందయ్య అనే గొర్ల కాపరి.ప్రతిరోజు లాగానే శుక్రవారం గొర్లు కాయడానికి వెళ్ళాడు.
మధ్యాహ్నం సమయంలో గ్రామ శివారులో గల ఎల్లమ్మ గుడి వెనకాల ఉన్న బావిలో ప్రమాదవశాత్తు తన గొర్రె బావిలో పడిపోయింది.ఆ గొర్రెను రక్షించబోతున్న క్రమంలో మొగిలి బొందయ్య కూడా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు.సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కుమారుడు మొగిలి ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బండి రాజేష్ తెలిపారు.