సిరా న్యూస్, ఓదెల
ఓదెల గౌడ సహకార సంఘం అధ్యక్షునిగా నాగపూర్ రవి
పెద్దపల్లి జిల్లా ఓదెల గౌడ సహకార సంఘం అధ్యక్షుడిగా నాగపురి రవి ని శుక్రవారం గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ముంజాల మహేందర్, డైరెక్టర్స్ గా చింతల పరశురాం, నాగపురి పైడి రాజు, మాచర్ల శంకర్, గట్టు అనిల్ , ముంజల మధు, మార్క చందు, పోతుగంటి మహేష్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్షులు మాట్లాడుతూ గౌడ సంఘానికి నా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. గౌడ సహకార సంఘానికి యువత ఎల్లప్పుడు ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు.