సిరాన్యూస్, ఆదిలాబాద్
శిక్షణలో సమయపాలన తప్పనిసరి : జిల్లా ఎస్పీ గౌష్ ఆలం
* ప్రతి ఒక్క ఆయుధంపై పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి
* శిక్షణ కేంద్రం పరిశీలన
శిక్షణలో సమయపాలన తప్పనిసరి అని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా శిక్షణ కేంద్రం లో శిక్షణ తీసుకుంటున్న వివిధ జిల్లాల నుండి వచ్చిన 255 శిక్షణ కానిస్టేబుళ్ల శిక్షణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న కానిస్టేబుల్ ఆయుధాలపై ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలించారు. అదేవిధంగా పలు రకాల ఆయుధాలను వాటి సామర్థ్యం, వినియోగించే పద్ధతి తదితర అంశాలపై కానిస్టేబుల్ లకు సవివరంగా వివరించారు. ఫైరింగ్ చెయ్యూ పద్ధతులు, ఎటువంటి అపాయం కలగకుండా ఉంటూ శత్రువులను మట్టుపెట్టే అంశాలపై వివరించారు. ఆయుధాలపై పూర్తి పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని తెలియజేశారు. ఫైరింగ్ లో మెలకువలను శిక్షణ కానిస్టేబుల్ లకు తెలియజేశారు. నూతన పద్ధతులను, మెలకువలను ఉపయోగించడం వల్ల ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ఫైరింగ్ చేయవచ్చని తెలియజేశారు. శిక్షణ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి సమయపాలన క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. తదుపరి శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి కానిస్టేబుల్ శిక్షణా కానిస్టేబుల్లకు అందజేస్తున్న సదుపాయాలను, లోటుపాట్లను శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ అదనపు ఎస్పి సి సమైయ్ జాన్ రావు ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పి సి సమైజాన్ రావు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు ఎన్ రాకేశ్, పి గోపికృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.