Goush alam:పోలీసు జాగిలం తార అందజేసిన సేవలు మరువలేనివి: ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
పోలీసు జాగిలం తార అందజేసిన సేవలు మరువలేనివి: ఎస్పీ గౌష్ ఆలం
* ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు జాగిలం తార
* పోలీసు జాగిలం తార పదవీ విరమణ కార్యక్రమం

పోలీసు జాగిలం తార అందజేసిన సేవలు మరువలేనివి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు.ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మంగ‌ళ‌వారం పోలీసు జాగిలం తార పదవీ విరమణ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మంలో జిల్లా ఎస్పీ పాల్గొని శాలువా పూలమాలలతో సత్కరించి, జాగిలం సేవలను కొనియాడారు. పోలీసు జాగిలం తార 2013 జ‌న‌వ‌రి 22న రోజున పుట్టి, 2013 సంవత్సరంలో ఐఐటిఎ మొయినాబాద్ లో ఎల్ సోమన్న హండ్లర్ కు అందజేసి సంవత్సరం పాటు ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలను కనుగొనడంలో శిక్షణను తీసుకొని ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేయడం జరిగింది. అప్పటినుండి 12 సం”ల పాటు నిర్విరామంగా మందు గుండు సామాగ్రి అయిన గన్ పౌడర్, ఆర్డీఎక్స్, సేఫ్టీ ఫీజు, టిఎన్టి, పీఇకే, కార్డెక్స్ లాంటి పేలుడు పదార్థాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించి పోలీసు వ్యవస్థకు ఉన్నతమైన సేవలను అందించింద‌ని తెలిపారు. పోలీసు జాగిలం తార తో హాండ్లర్ ఎల్ సోమన్న జాగిలంతో పాటు విధులను నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా వీఐపీ బందోబస్తుల సమయంలో ముఖ్యమైన వ్యక్తులు కూర్చుండి ఉండే స్టేజి, పబ్లిక్ గ్యాలరీ లలో రోడ్డు భద్రతా విషయంలో రోడ్డుపై, కల్వర్టుల వ‌ద్ద‌ మందు గుండు, పేలుడు పదార్థాలను కనుగొనడంలో విధులను నిర్వర్తించడం జరిగింది. శేష జీవితం ఎటువంటి విధులను నిర్వర్తించకుండా పూర్తిగా విరామం ను అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎ నవీన్, ఎన్ చంద్రశేఖర్, టి మురళి, బాంబు స్క్వాడ్ ఇంచార్జ్ జే ప్రేమ్ సింగ్, డాగ్ స్క్వాడ్ ఇంచార్జ్ పి రమేష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, డాగ్స్ స్క్వాడ్ బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *