Goush alam: బాధిత పోలీసు కుటుంబాలకు అండ‌గా ఉంటాం : ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
బాధిత పోలీసు కుటుంబాలకు అండ‌గా ఉంటాం : ఎస్పీ గౌష్ ఆలం
బాధిత కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు రూ .8 లక్షల చెక్కుకు అంద‌జేత‌
* పోలీసు యంత్రాంగం వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

పోలీస్ వ్యవస్థకు సేవలు అందిస్తూ విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అండ‌గా ఉంటామ‌ని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. గురువారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన‌ మహాశివరాత్రి సందర్భంగా కుంటల జలపాతం వ‌ద్ద‌ విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుతో మృతి చెందిన నేరడిగొండ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కే మార్కండేయ కుటుంబ సభ్యులైన భార్య కే సుజాత, కొడుకు కె నిఖిల్ లకు భద్రత కు సంబంధించిన ఎనిమిది లక్షల విలువైన చెక్కును జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎటువంటి సమస్యలకైనా జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలను అందిస్తుందని హామీ ఇచ్చారు. 24 గంటలు అవిశ్రాంతంగా విధులు నిర్వర్తించే పోలీసులు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం అనారోగ్య బారిన పడకుండా ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే నిన్న జిల్లా పోలీసు యంత్రాంగానికి వారి కుటుంబ సభ్యులకు కేర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *