సిరాన్యూస్, సిరికొండ
చదువుపై దృష్టి సారిస్తే అభివృద్ధి సాధ్యం : ఎస్పీ గౌష్ ఆలం
* గంజాయి, కల్తీకల్లు బారిన పడకుండా అవగాహన
* మత్తు పదార్థాలు వాడడం చట్టరీత్యా నేరం
* చెట్లను రక్షించాలి – డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్
* చిమ్మన్ గూడిలో ఆదివాసీలతో ఆత్మీయ సమ్మేళనం
చదువుపై దృష్టి సారిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. మారుమూల ఆదివాసి గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో మంగళవారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం చిమ్మనిగూడి గ్రామంలో చుట్టుపక్కల వాయి పేట, ఫకీర్ నాయక్ తండ, బోరింగ్ గూడ, కుంట గూడ, సూర్య పేట,పాలవగు, సీమన్ గుడి, లెండి గూడ,ధర్మ సాగర్, కన్నాపూర్, ముత్యంపేట్, లక్ష్మీపూర్ కే, గ్రామాల ప్రజలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ , డీఎఫ్.ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ పాల్గొన్నారు.మొదటగా గ్రామ ప్రజలు డప్పు వాయిద్యాలు గుస్సాడి నృత్యాల నడుమ జిల్లా అధికారులకు ఘనంగా స్వాగతం పలికి వేదికపైకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీలకు అవగాహన కల్పించాలని ఇంత మారుమూల గ్రామంలో ప్రజలకు అన్ని రంగాలపై పట్టు ఉండాలని ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివాసీలు అభివృద్ధి చెందాలంటే చదువుకు ప్రాధాన్యం ఇచ్చి ఉన్నత చదువులను అభ్యసిస్తూ ఉన్నత ఉద్యోగాలను సంపాదించాలని ప్రభుత్వం అందజేసే ప్రతి ఒక్క ప్రయోజనాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. అదేవిధంగా గంజాయి కల్తీకల్లు గుడుంబా లాంటి చెడు అలవాట్లను మానుకొని సమాజంలో ఉన్నతంగా జీవించాలని సూచించారు. ఈ సందర్భంగా గంజాయి కల్తీకల్లు పై ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన పోస్టర్లను ఆవిష్కరించారు. అదేవిధంగా యువత సంఘవిద్రోహశక్తుల వైపు మరలకుండా గ్రామ పెద్దలు అవగాహనను కల్పిస్తూ ఉండాలని సూచించారు. అదేవిధంగా పంటలకు రక్షణగా అక్రమంగా కరెంటు తీగలు అమర్చి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని తెలిపారు, అక్రమంగా కరెంటు తీగలు అమర్చిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. రానున్న ఎన్నికలలో కలిసికట్టుగా 100వాతం ఓటింగ్ నిర్వహించేలా, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు తెలియజేశారు. అనంతరం డీఎఫ్ఒ ప్రశాంత బాజీరావు పాటిల్ మాట్లాడుతూ చెట్లను నరకడం నేరమని తెలియజేశారు. అడవులలో కలప అక్రమ రవాణా, జంతువుల పేట లాంటివి నేరమని సూచించారు. కార్యక్రమంలో ఉట్నూర్ డిఎస్పి సిహెచ్ నాగేందర్, ఇచ్చోడ సీఐ ఈ భీమేష్, సిరికొండ ఎస్సై బి నవీన్, నేరడిగొండ ఎస్సై శ్రీకాంత్, ఇచ్చోడా ఎస్ఐ జీ నరేష్, గ్రామ ప్రజలు ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ
సిరికొండ మండల పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులను జిల్లా ఎస్పి గౌస్ ఆలం పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కేటాయించిన నూతన స్థలాన్ని పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు