సిరా న్యూస్,నిర్మల్;
కడెం ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రానికి చెందిన జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ తోకల రాకేష్ (37 ) గురువారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే వెంటనే అతని కుటుంబ సభ్యులు రాకేష్ ను కరీంనగర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తుండగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆసుపత్రిలో మృతి చెందారు. రాకేష్ బ్రతికుండగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మరణ వాంగ్మూలం ప్రకారం తన ఆత్మహత్యకు సంబంధిత ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ప్రభాకర్ , శ్రీనివాస్ ఉన్నతాధికారుల వేధింపుల వల్ల తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మరణ వాంగ్మూలంలో రాకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు జన్నారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు…