-జార్ఖండ్ తరహా లో పింఛన్లు ఇవ్వాలి
-తెలంగాణ ఉద్యమ రాష్ట్ర నాయకురాలు సువర్ణ సులోచన
సిరా న్యూస్,మంథని;
తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించుకునే క్రమంలో మాపై చాలా కేసులు నమోదయ్యాయి, ఎన్నోసార్లు జైల్లో కెళ్లినం మాలాంటి ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఝార్ఖండ్ రాష్ట్రం తరహాలో తమకు పింఛన్లు అందించాలని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర నాయకురాలు సువర్ణ సులోచన సీనియర్ న్యాయవాది మాదాటి ప్రభాకర్ రెడ్డి అన్నారు.
మంగళవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనునిత్యం పోరాటాలు చేసి తెలంగాణ వచ్చేంతవరకు శ్రమించిన మా ఉద్యమకారులని మివల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించబోతుందని తెలంగాణ ఉద్యమకా కారులను తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రోత్సహించిన కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తెలంగాణ కోసం అమరులైన 1500 మంది అమరుల కుటుంబాలను పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి పదవి అలంకరించిన తర్వాత
మా తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా పక్కకు పెట్టేసి గుర్తించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారిని తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని కుట్రలు చేసిన నాయకులకు కెసిఆర్ వారిని చేరదీసి అందలం లెక్కించి మంత్రులను చేసిన ఘనత కల్వకుంట చంద్రశేఖర్ కి దక్కుతుందని వారన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగై పోతుందని రాజకీయ సర్వేలు చెప్పిన తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి మొగ్గుచూపిందని తెలంగాణ వస్తే అమరుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ ప్రజలు బాగుపడతారని గుర్తించి తెలంగాణను ఇవ్వడం జరిగిందని వారన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మా ఉద్యమకారులను గుర్తించి మాకు నివాస భూమి, ఇందిరమ్మ ఇండ్లు పింఛన్లు బస్సు ప్రయాణానికి బస్సు పాసులు అందించి ఆదుకోవాలని కోరారు.
ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామని వారన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు తోకల మల్లేష్ చిదురాల మధుకర్ రెడ్డి ఎస్కే ముజీబ్, మిరియాల రామిరెడ్డి, దాసరి శంకర్, బొడ్డు వెంకటేశ్వర్లు ఎస్.కె చాంద్ భాషా లు పాల్గొన్నారు.