సిరా న్యూస్,నెల్లూరు;
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ నెల్లూరులో పర్యటించారు. శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన PM సూరజ్ పోర్టల్ ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. విజయవాడ నుండి హెలికాప్టర్లో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో దిగిన అబ్దుల్ నజీర్ దంపతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హరి నారాయణ్, ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.