సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి జిల్లా ఆలేరు మండలం..కొలనుపాక జైన దేవాలయాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. అయనకు జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర స్వాగతం పలికారు. కొలనుపాకలో శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని, అభిషేక పూజలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్. వేద పండితులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్ర గవర్నర్ కు స్వాగతం పలికారు. తొలుత దేవాలయం ముందు బతుకమ్మలు, బోనాలు, కోలాటలతో మహిళలు స్వాగతం పలికారు.