Govind Naik: సదరం స్లాట్ బుకింగ్ నిరంతర ప్రక్రియ: బాణావత్ గోవింద్ నాయక్

సిరాన్యూస్‌, ఖానాపూర్
సదరం స్లాట్ బుకింగ్ నిరంతర ప్రక్రియ: బాణావత్ గోవింద్ నాయక్

రాష్ట్ర ప్రభుత్వం సదరం స్లాట్ బుకింగ్ నిరంతర ప్రక్రియ గా మార్చింద‌ని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. సోమ‌వారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో బాణావత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సదరం స్లాట్ బుకింగ్ నిరంతర ప్రక్రియగా మార్చారు. ఈసదరం సర్టిఫికెట్ స్లాట్ బుకింగ్ నిరంతర ప్రక్రియను అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఇక నుండి సదరం స్లాట్ బుకింగ్ అనేది నిరంతర ప్రక్రియగా ఉంటుంద‌ని తెలిపారు. ఎవరైనా ఎపుడైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చు అని అన్నారు. స్లాట్ బుక్ చేసుకోగానే స్లాట్ ఉన్నచో స్లాట్ క్యాంపు తేది, వెన్యూ చూపెడుతుందని, స్లాట్ లేనిచో రిజర్వులో ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఎపుడైతే స్లాట్ షెడ్యూల్ ఇస్తారో వారికి ఆటోమేటిక్ గా స్లాట్ అల్లాట్మెంట్ జరుగుతుందని, స్లాట్ బుక్ కాగానే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు డిపార్ట్‌మెంట్ ద్వారా ఎస్ఎంఎస్ పంపడం జరుగుతుంద‌ని తెలిపారు.అందులో క్యాంపు అధికారులు స్లాట్ వివరాలు వారికి ఫోన్ ద్వారా తెలియజేయబడుతుంద‌ని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ అవకాశానికి వికలాంగులందరూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *