సిరా న్యూస్,ఖానాపూర్ టౌన్
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం: బాణావత్ గోవింద్ నాయక్
కేంద్రంలో ఇండియా కూటమి దే అధికారమని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్ దీమా వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికలో ఇండియా కూటమి అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకుని అధికారం చెప్పట్టడం ఖాయమని తెలిపారు. కొద్దిరోజుల్లో బీజేపీ నియంతృత్వ పాలన ముగుస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చెప్పట్టి జనారంజక పాలన కొనసాగిస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది లేని సంక్షేమ పాలన సాధ్యమని అన్నారు. ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణక్క భారీ మెజారిటీ తో విజయం సాధించాబోతున్నరని తెలిపారు.