సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
మహేశ్వర్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి
* ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
* కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్
నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓటు వేసి ప్రజలు గెలిపిస్తే నిర్మల్ కు నెలకోసారి వచ్చి వెళ్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గం లో పర్యటించి ప్రజల నుంచి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల విలువ తెలుస్త్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీ పథకాల విలువ అనేది ఎమ్మెల్యే కు తెలియదన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం అని, అలాంటి ప్రజా ప్రభుత్వంను పడాకొడుతాం అనడం సిగ్గుచేటన్నారు. మహేశ్వర్ రెడ్డి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవమాన పరిచారని, వెంటనే ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీని గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు , బాణావత్ గోవింద నాయక్ , షేక్ సమ్మి, పాల్గొన్నారు.