సిరాన్యూస్, ఖానాపూర్
రైతు సంక్షేమం కాంగ్రెస్ తోనే
* కేసీఆర్ మాటలు తెలంగాణ రైతంగం నమ్మరు
* కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్
రైతు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు.నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ నాయక్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రైతు సంక్షేమన్ని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, కేసీఆర్ పగటి వేశాల మాటలు తెలంగాణ ప్రజల రైతాంగం నమ్మదన్నారు. పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో విద్య ఉద్యోగ అవకాశలతో పాటు రైతంగం విధ్వంసం కు గురైందని తెలిపారు.తమ సమస్యలు పరిష్కరించి హక్కులు అడిగిన ఆదివాసీ రైతులను చావు దెబ్బలు కొట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. అధికారం కోల్పోయే సరికి నాలుగు నెలలు గడవని కాంగ్రెస్ ప్రభుత్వం తో కరువు పేరుతో అసమర్ధత కేసీఆర్ పొలం బాట పేరుతో పొలిటికల్ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. తిని తిననట్టుగా తీర్తయాత్రలకు పోతున్నట్లుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందని ఏద్దేవ చేశారు.కడుపుమంటతో కొత్త నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు ఏవి ఏమైనా తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ సీయం రేవంత్ రెడ్డి తోనే న్యాయం జరుగుతుందని విశ్వాసంతో ఉన్నారని తెలిపారు.