సిరాన్యూస్, ఖానాపూర్
ప్రభుత్వ పథకాలే సుగుణక్కను గెలిపిస్తాయి: చైర్మన్ బాణావత్ గోవింద నాయక్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను గెలిపిస్తాయని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బుధవారం గోవింద నాయక్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థి ఆత్రం సుగుణక్కను గెలిపిస్తాయన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ, బీఆర్ ఎస్ దోపిడి పాలనలో విసిగిపోయారని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ ,మహిళలకు మహిళ లక్ష పథకం, రైతు భరోసా, ప్రతి కుటుంబానికి 200 ఉచిత విద్యుత్ హామీలను నెరవేర్చిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.