సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఫిబ్రవరి 10 న ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం…
ఫిబ్రవరి 10 న ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహిస్తున్నట్లు డిసిసిబి డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి కళాశాల పూర్వ విద్యార్థులందరూ హాజరు కావాలని కోరారు. కళాశాల అభివృద్ధి, విద్యా ప్రమాణాలు పెంపు, తదితర అంశాల గురించి చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులంతా సమావేశానికి విచ్చేసి తమతమ సలహాలు సూచనలు అందించాలని కోరారు.