సిరా న్యూస్,హైదరాబాద్;
బాగ్ అంబర్పేట ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడు సురేష్ విద్యార్థినులపై లైంగికంగా వేధింపులకు పాల్పడిన ఘటన బయటపడింది. ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థినులపై లైంగిక దాడి జరిపినట్లు ఆరోపణ. బాధితులు అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. అంబర్ పేట పోలీసులు సురేష్ ను అరెస్ట్ చేసారు. గత ఒక నెల నుండి ఈ స్కూల్లో విద్యాభ్యాసం నేర్పిస్తున్నాడు. స్కూల్ కి చేరుకున్న విద్యార్థి సంఘాలు నాయకులు నిరసనకు దిగారు.