-ఐదు లక్షల ఓటర్ల ఎన్రోల్మెంటును చేయడమే లక్ష్యం
-తెలంగాణ మెడికల్ కౌన్సిలర్ మేంబర్ డా.బండారు రాజ్ కుమార్
సిరా న్యూస్,మంథని;
పట్టభద్రులు అందరు ఎమ్మెల్సీ ఎన్నకల కోసం తమ ఓటు నమోదు చేసుకోవాలని తెలంగాణ మెడికల్ కౌన్సిలర్ మేంబర్, ఆర్ కే హాస్పిటల్ చైర్మన్ బండారు రాజ్ కుమార్ అన్నారు.
మంగళవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాలోని డిగ్రీ చదువుకున్నటువంటి వారు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పుడు ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు, ఇటీవలే తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోర్స్ సంస్థను కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని, సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఐదు లక్షల ఓటర్ల ఎన్రోల్మెంటును చేయడమే లక్ష్యమని, తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నామని , ఓటు వేయాలంటే ఓటు హక్కును రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ సందర్భంగా మంథనిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, డిగ్రీ చదువుకున్న పట్టభద్రులకు మూడు సంవత్సరాలు పూర్తయిన వారు ఆఫ్లైన్, ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని డిగ్రీ సర్టిఫికెట్ ,ఆధార్ కార్డు ,ఫోటో, ఫోన్ నెంబరు ,ఈమెయిల్ ఐడి ,జతపరిచి ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వాల్సి ఉంటుందని, వచ్చే సంవత్సరం జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఐదు లక్షల కొత్త ఓటర్లను అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని పనిచేస్తూ ముందుకు వెళ్తున్నామని ,ఓటింగ్ నమోదు చేసుకొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఈ విధంగా సందర్భంగా పిలుపునిచ్చారు.