మంథని ఆర్డిఓ హనుమ నాయక్
సిరా న్యూస్,కమాన్ పూర్;
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని మంథని ఆర్డిఓ హనుమ నాయక్ అన్నారు.
శనివారం కమాన్ పూర్
మండలంలో ఐకెపి మరియు వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంథని ఆర్.డి.ఓ హనుమా నాయక్ శనివారం ప్రారంభించారు. మండలంలో సేర్ఫ్ ఆధ్వర్యంలో ముల్కలపల్లి, కమాన్ పూర్, పేరపల్లిలో , పి.ఈ.సి.ఎస్ ఆధ్వర్యంలో జూల పల్లి, గొల్లపల్లి, గుండారం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్.డి.ఓ మాట్లాడుతూ .. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. దళారులకు తక్కువ ధరలకు విక్రయించి నష్టపోవద్దని కోరారు. అలాగే క్వింటాలుకు ఏ గ్రేడ్ కు 2203 రూపాయలు సామాన్య గ్రేడ్ కు 21 83 ప్రభుత్వపరంగా ఆయా రైతుల బ్యాంకు ఎకౌంట్లో వేయడం జరుగుతుందని అలాగే తేమశాతం లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలని రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అరిపొద్దీన్ , ఆర్.ఐ సందాని, ఎపిఎం శైలజశాంతి , పి. ఏ.సి.ఎస్ సెక్రటరీ తిమ్మరాజు సంతోష్ కుమార్ లతో పాటు సీసీ శ్రీనివాస్ లతా చంద్రకళ అనూష మహేశ్వరి మరియు రేగుల కుమార్ బోనాల పవన్ దాసరి రాజు రైతులు, హమాలీలు పాల్గొన్నారు.