సిరా న్యూస్,తాండూర్;
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండల పరిధిలోని రేచిని రైల్వేస్టేషన్ రోడ్ నందు గల సేవాజ్యోతి కాలనీలో ఉన్న శ్రీ స్వశక్తి భారత్ సేవాట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సేవా జ్యోతి శరణాలయం లో హిందూ సామ్రాజ్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు, ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి గజ్జెల్లి సగర మాట్లాడుతూ,జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తో హిందూ సామ్రాజ్య స్థాపన జరిగింది,పట్టాభిషేకంతో హిందూ బందువులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు, జీజీయభాయి ఛత్రపతి శివాజీ ని ఉత్తమ దేశభక్తితో దైవశక్తి తో చిన్ననాటి నుంచే తీర్చిదిద్ది హిందూ ధర్మం నిలబెట్టి హిందూ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన వీర మాత ఐనది, మనం మన పిల్లలకు దేశభక్తి, దైవభక్తి సేవానిరతి తో మంచి విషయాలు నేర్పించాలి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలి అని పేర్కొన్నారు శ్రీదేవి మల్లేశం గజ్జెల్లి సగరలు మాట్లాడుతూ. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి శరణాలయం మానసిక మతిస్థిమితం లేని మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
=================