తాండూర్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

బాలకృష్ణుని వేషాదరణలతో చిన్నారుల సందడి
సిరా న్యూస్,తాండూర్;
తాండూర్ లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు చిన్నారులకు వారి వారి తల్లిదండ్రులు బాలకృష్ణుని వేషధారణలతో అలంకరింపజేసి వేడుకలను జరుపుకున్నారు. అందుకోసం ముందుగానే కృష్ణుని వేషాధారణకు అవసరమైన రెడీమేడ్ అలంకరణ వస్తువులను కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ఇక కృష్ణాష్టమి పర్వదినం రావడంతో వారి పిల్లలకు కృష్ణుని వేషాలు వేసుకున్నారు. అనంతరం వారి పిల్లలను చూస్తూ తల్లిదండ్రులు మంత్రముగ్ధులవడం కనిపించింది. అయితే శ్రావణమాసంలో వచ్చే కృష్ణాష్టమి పండగకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణాష్టమి పండగ రోజు చాలా ప్రాంతాలలో ఉట్లు ఏర్పాటు చేసి వాటిని కొడుతుంటారు. అసలు కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో చాలా మందికి తెలియదు. ఇదో ధర్మసందేహంగా ఉంటుంది. సాధారణంగా శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉండగా పలువురి ఇళ్లలోకి ప్రవేశించి పాలు, పెరుగును దొంగతనం చేసేవాడు. అయితే ఆ రోజుల్లో బుల్లి కృష్ణుడి ఆగడాల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది తమ పాలు, పెరుగు ఉట్టిలో పెట్టి అందకుండా పైన కట్టేవాళు అయితే కృష్ణుడు చాలా చిలిపిగా తన స్నేహితులను ఒంగోబెట్టి వాళ్లపైకి ఎక్కి ఉట్టిలోని పాలు, పెరుగును దొంగతనం చేసి తినేవాడు. ఆనాటి కృష్ణుడి గురించి పలువురికి చాటిచెప్పేందుకు, ముఖ్యంగా ఇప్పటి బాలలకు కృష్ణుడి అల్లరి గురించి తెలియజేసేందుకు కృష్ణుడి జన్మదినమైన రోజు ఉట్లు ఏర్పాటు చేసి వాటిని పగలకొట్టి సంతోషిస్తుంటారు. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. ఏది ఏమైనా ఈ తరహా సంప్రదాయ పండుగలను నేటి 5 జి కాలంలో కూడా తూచా తప్పకుండా పాటించడం గొప్ప పరిణామం అని ఆధ్యాత్మికవేత్తలు ప్రశంసిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాబోయే తరానికి మన గత ఆధ్యాత్మికథ చరిత్రను కళ్ళకు కట్టినట్టు అర్ధం చేపించిన వాళ్ళం అవుతామని పండితులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *