బస్ భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

జాతీయ జెండాను ఆవిష్కరించిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్
సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కేంద్ర కార్యాలయం బస్ భవన్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం టీఎస్ఆర్టీసీని ఆదరిస్తోన్న ప్రజలకు, సంస్థ అభివృద్దికి నిరంతరం పాటుపడుతున్న సిబ్బందికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, ప్రతి పౌరుడు దేశ పురోభివృద్ధికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శుభదినాన భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహానీయుడిని స్మరించుకోవాలన్నారు.
ఈ గణతంత్ర వేడుకల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, ఫైనాన్స్ అడ్వజర్ విజయ పుష్ఫ, సీపీఎం ఉషాదేవి, తార్నాక ఆస్పత్రి ఓఎస్డీ డాక్టర్ సైది రెడ్డి, సీటీఎం జీవన ప్రసాద్, సీసీఓఎస్ విజయభాస్కర్, సీఈఐటీ రాజశేఖర్, సీటీఎం కమర్షియల్ సుదర్శన్, సీసీఈ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *