సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఉట్ల పండగ వేడుక ఘనంగా జరిగింది. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆలయంలోని చిన్ని కృష్ణునికి విశేష అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఉట్ల పండగ వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి సీతారాములను చిన్ని కృష్ణుని నీ ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి ఉట్ల పండగ వేడుక నిర్వహించారు. స్వామివారి ఎదుట యాదవ యువకులు ఉత్సాహంతో ఉట్టిని కొట్టారు. అనంతరం ఆలయ అధికారులు యాదవ యువకులను ఆలయ సాంప్రదాయ ప్రకారం సన్మానించారు. అనంతరం స్వామి వారు తిరువీది సేవలో పాల్గొన్నారు..