సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ లో కొనసాగుతున్న గృహజ్యోతి…
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గృహజ్యోతి పథకం పై కసరత్తు జోరుగా కొనసాగుతోంది. ఎన్ పీ డీ సీ ఎల్ సిబ్బంది ఇంటింటా తిరుగుతూ మీటర్ సర్వీస్ నంబర్లను రేషన్ కార్డ్, ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తున్నారు. ఇంటి యజమానులు మాత్రమే కాక అద్దె ఇండ్లలో ఉండే వ్యక్తులకు సైతం గృహజ్యోతి పథకం వర్తిస్తుందని చెబుతున్నారు. మీటర్ రీడింగ్ తీసుకోవడానికి ఇంటికి వచ్చే సిబ్బందికి రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుండడంతో, అర్హులైన కుటుంబాల వివరాలను అధికారులు ఆన్ లైన్ చేయడంలో బిజీబిజీగా దర్శనమిస్తున్నారు. మీటర్ రీడింగ్ కోసము సిబ్బంది ఇంటికి వచ్చిన టైంలో ఇంటి వద్ద ఉండే పరిస్థితి లేనట్లయితే, మీటర్ సర్వీస్ నెంబర్లకు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ తో పాటు ఫోన్ నెంబర్ రాసిన కాగితాన్ని కట్టి ఉంచాలని సూచిస్తున్నారు. కాగా ఆదివారం టీచర్స్ కాలనీ, రిక్షా కాలనీ, తదితర కాలనీల్లో జేఏఓ గోపాల్ రావు, లైన్ మెన్ ప్రేమానందం, జేఎల్ఎం ప్రవీణ్ కుమార్, ఆపరేటర్ సుదర్శన్ గౌడ్, తదితరులు ఇంటింటికి తిరుగుతూ… అర్హులైన కుటుంబాల పేర్లను ఆన్ లైన్ లో నమోదు చేశారు.