హామీ ఇచ్చాము…అమలు చేస్తున్నాము

ఎమ్మెల్యే విజయరమణ రావు

సిరా న్యూస్,పెద్దపల్లి;
తమ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా రెండు పథకాలు అమలు చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. హైదరాబాద్ నుండి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన పెద్దపల్లికి తొలిసారి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఎమ్మెల్యేను గజ మాలతో సత్కరించి, గర్రెపల్లి నుండి బైక్ ర్యాలీ తీసారు. పేరు పేరునా ప్రతి ఒక్కరికి తన గెలుపులో సహకారం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జరిగిన
మహాలక్ష్మి పథకం ద్వారా ప్రవేశ పెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ఆయన అధికారులు, మహిళలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ’ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారని తదుపరి పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆర్టీసి బస్ స్టాండ్ ఆవరణలో ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. మహిళలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి మధు మోహన్, తహసీల్దార్ రాజకుమార్, మహిళలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *