షబ్బీర్ అలీ
సిరా న్యూస్,హైదరాబాద్;
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ తెలంగాణ లో జనాభా 85 శాతం వున్నారు. ఆ యా వర్గాలకు ఎన్నికలలో లో ఇచ్చిన వాగ్దానాలు వాళ్ల అభివృద్ధి గురించి పూర్తి చేయడం మా భాద్యత అని రాష్ట్ర ప్రభుత్వ ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాల సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో లో హామీ లు ఇస్తే అవి కచ్చితం గా అమలు కావాలి. మేం ఇచ్చిన హామీ ల మీద, మా నలుగురు చైర్మన్ లతో చర్చించడం జరిగింది. ఎస్సీ డిక్లరేషన్, ఖర్గే, , బీసీ డిక్లరేషన్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మైనారిటీ డిక్లరేషన్ సల్మాన్ కుర్షీద్ విడుదల చేశారు. వాటితో సహా, 6 గ్యారంటీస్ 100 డేస్ లో ఎలా పూర్తి చేయాలి అనే అంశం పై రివ్యూ చేసుకున్నాం. రేపు ఎల్లుండి ఛార్జ్ తీసుకున్న తర్వాత వివిధ శాఖల కార్యదర్శులని పిలిచి మాట్లాడుతా. బడ్జెట్ లో మేం పెట్టాలి… అవి ఆఫీసర్స్ పెడుతున్నారా లేదా అనే విషయం సమీక్షిస్తా. పార్టీ పరం గా మేము, ప్రభుత్వం నుండి భట్టి చేస్తాం . 4 కులాల దగ్గరికి ఎలా పోవాలి చర్చినామని అన్నారు.