సిరాన్యూస్, బోథ్
యూత్ కాంగ్రెస్ బోథ్ అసెంబ్లీ అధ్యక్ష బరిలో గుడాల అనీష్ కుమార్
యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ అధ్యక్ష ఎన్నికల్లో గుడాల అనీష్ కుమార్ బరిలో నిలిచారు. ఆగష్టు 5 నుండి సెప్టెంబర్ 5 వరకు జరిగే ఈ ఎన్నికల పర్వంలో ఆదిలాబాద్ జిల్లా నాయకులు ఏలేటి అశ్విన్ రెడ్డి ఆదేశానుసారం బుధవారం గుడాల అనీష్ కుమార్ నామినేషన్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 18- 35 సంవత్సరాల లోపు యువతీ యువకులు వారు యాప్ ద్వారా ఆన్ లైన్ ఓటింగ్లో పాల్గొని తనకు మద్దతు తెలపాలని కోరారు. బోథ్ అసెంబ్లీ ప్రెసిడెంట్ గా ప్రతీ ఒక్కరి గొంతుకనై వినబడేలా కనబడేలా మీ అందరి మధ్యవుంటానని తెలిపారు.