సిరాన్యూస్, ఆదిలాబాద్
పార్టీ వ్యతిరేకకు పాల్పడిన కౌన్సిలర్ల పై వేటు: కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్
* పలువురి కార్యకర్తల పై క్రమశిక్షణా చర్యలు
* 6 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణ
కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకకు పాల్పడిన కౌన్సిలర్ల పై బహిష్కరణ వేటు వేస్తున్నట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి హాజరై అనుకూలంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు 3వ వార్డు- చదల్ వార్ సాయిప్రణయ్,7వ వార్డు – పాయక్ రావ్ అంజుభాయి,14 వ వార్డ్-బడాల సజాత,19 వవార్డ్ -మడావి మంగళ, 30 వవార్డ్ మొగులూరి విజయ్ ,31 వవార్డ్ కౌన్సిలర్ ఉమ్మె సల్మ తో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన మరో ఇద్దరు కౌన్సిలర్లు 8వ వార్డు-రేష్మా ముబారక్ , 37వ వార్డ్ కౌన్సిలర్ అంబకంటి అశోక్ లను పార్టీ నుండి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్టు తెలిపారు.వీరితో పాటు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న కార్యకర్తలు చదల్ వార్ శంకర్ ,పాయక్ రావు ఆనంద్ ,పాయక్ రావు సాహెబ్ రావు,సయ్యద్ రషీద్ ఉల్ హక్ , సయ్యద్ శంష్ ఉల్ హక్ ,మడావి రామేశ్వర్ ,బడాల సృజన్ కుమార్ ,ముబారక్ లపై క్రమశిక్షణాచర్యల కింద ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు నగేష్ తెలిపారు.తక్షణమే వీరిపై ఈ బహిష్కరణ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.