Guggilla ellaya: ఫోటో, వీడియో గ్రాఫర్ల ఖానాపూర్ అధ్యక్షులుగా గుగ్గిళ్ల ఎల్లయ్య

సిరా న్యూస్,ఖానాపూర్
ఫోటో, వీడియో గ్రాఫర్ల ఖానాపూర్ అధ్యక్షులుగా గుగ్గిళ్లఎల్లయ్య

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఖానాపూర్ ఫోటో , వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం యొక్క ఎన్నికలు గురువారం స్థానిక లక్ష్మి వెంకటేశ్వరాలయంలో అధ్యక్షులు పడిగెల కాశినాథ్ , నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతామణి శ్రీనివాస కృష్ణ స్వామి, సీనియర్ ఫోటో గ్రాఫర్ గౌరీకర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఖానాపూర్ అధ్యక్షులుగా గుగ్గిళ్ల ఎల్లయ్య, ఉపాధ్యక్షులుగా పెద్ది నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా బట్టు వరుణ్, కోశాధికారిగా జంజిరాల రాజేష్, ప్రచార కార్యదర్శిగా మాదిరె సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎలిగేటి మల్లేష్, కోర్ కమిటీ అధ్యక్షులుగా గండ్రత్ లవకుమార్ గా నియమితులయ్యారు. గత కార్యవర్గ స‌భ్యులు నూతనంగా ఎన్నికైన సభ్యులను సన్మానించి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యవర్గము జులై 24-2026 వరకు కొన‌సాగుతుంద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు తలారి సాయికుమార్, సొల్లు నవీన్,బి రాజ్ కుమార్,నాగరాజు, సంజయ్ , ఉమేష్, , రాజశేఖర్, రామ్ లక్ష్మన్, జి శేఖర్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *