Gulab Singh Filmcity: ఆదిలాబాద్‌లో ఫిల్మ్‌సిటీ…

సిరా న్యూస్, డిజిటల్‌:

ఆదిలాబాద్‌లో ఫిల్మ్‌సిటీ…
+ ఎగబడుతున్న సందర్శకులు
+ ఫోటో షూట్‌ల కోసం క్యూకడుతున్న జనం
+ పిక్నిక్‌ స్పాట్‌గా ఎదుగుతున్న గులాబ్‌సింగ్‌ ఫిల్మ్‌సిటీ

అడవుల జిల్లా ఆదిలాబాద్‌ సహజంగానే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఎటూ చూసిన చుట్టూ గుట్టలు, పచ్చని చెట్లు దర్శనమిస్తాయి. జలపాతాలు, సెలయేర్లు, ప్రాజెక్ట్‌లు, అభయారణ్యాలు, పార్క్‌లు అదనపు ఆకర్షణగా కనిపిస్తాయి. అలాంటి ఆదిలాబాద్‌లో మరింత అహ్లాదాన్ని పంచడానికి ఫిల్మ్‌ సిటీ అందుబాటులోకి వచ్చింది. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం చింతగూడ గ్రామంలో 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన గులాబ్‌ సింగ్‌ ఫిల్మ్‌సిటీ” సెంటర్‌ ఆప్‌ అట్రాక్షన్‌గా మారింది. గుడిహత్నూర్‌ నుండి ఆదిలాబాద్‌ వైపు వచ్చేటప్పుడు ఎడమ వైపు చింతగూడకు వెళ్లేందుకు దారి కనిపిస్తుంది. అక్కడి నుండి కేవలం 1.5 కిలోమీటర్‌ లోపలికి వెళితే మనకు ఫిల్మ్‌సిటీ దర్శనమిస్తుంది. ఈ ఫిల్మ్‌సిటీ ప్రత్యేకతలపై సిరా న్యూస్‌ స్పెషల్‌ స్టోరీ…

ఫోటో షూట్‌ల కోసం ప్రత్యేకంగా…

ఆదిలాబాద్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గులాబ్‌ సింగ్‌ ఫిల్మ్‌సిటీ ఇప్పుడు ఫోటోషూట్‌లకు స్పెషల్‌ స్పాట్‌గా మారింది. ప్రస్తుతం సోషల్‌ మీడియా ట్రెండ్‌ నడుస్తున్న ఈ కాలంలో ఫోటోలు, వీడియోలకు మంచి గిరాకీ ఉందన్న విషయం అందరికి తెలిసిందే. హై రెజెల్యూషన్‌ కెమెరాలు, హై స్పీడ్‌ ఇంటర్నెట్, సెల్‌ఫోన్‌లోనే అందుబాటులో ఉండటంతో జనాలు సోషల్‌ మీడియాలో దూసుకువెళ్తున్నారు. ఇన్‌స్టా, యూట్యూబ్, టిక్‌–టాక్‌లలో వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. దీనికి తోడు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు సైతం ప్రతీ పెళ్లిలో కామన్‌గా మారడంతో ఇలాంటి అందమైన లొకేషన్లకు మంచి డిమాండ్‌ పెర్గింది. ఈ ఫిల్మ్‌సిటీలో ఫోటో షూట్‌లు, వీడియో షూట్‌ల కోసం ప్రత్యేకమైన స్పాట్‌లు ఏర్పాటు చేయడం సైతం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సహజసిద్దమైన వాగులో నాటు పడవ బోటింగ్‌ ఇక్కడ అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.

పిక్నిక్‌లు, ఫ్యామిలీ గెట్‌టుగెదర్‌లు..

ఇక్కడ కేవలం ఫోటో షూట్‌ల కోసం మాత్రమే కాకుండా పిక్నిక్‌లు, ఫ్యామిలీ గెట్‌టుగెదర్‌ల కోసం సైతం జనాలు భారీగా వస్తుంటారు. 20 ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఈ ఫిల్మ్‌సిటీలో పండ్ల తోటలు, పంట క్షేత్రాలు, గెస్ట్‌ హౌజ్‌ వంటి సదుపాయాలు ఉండటం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. పిక్నిక్‌లు, ఫ్యామిలీ గెట్‌టుగెదర్‌లు నిర్వహించడానికి అనువుగా ఉండటంతో జనాలు క్యూకడుతున్నారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో అయితే రద్దీ భారీ ఉంటుందనే టాక్‌ ఉంది. నామమాత్రపు ఎంట్రీ ఫీజ్‌తో ఈ పిల్మ్‌సిటీని సందర్శించే అవకాశం ఉండటంతో ధనిక, పేద అనే బేధం లేకుండా ప్రతీ ఒక్కరు ఎంజాయ్‌ చేయవచ్చి నిర్వహకులు గులాబ్‌ సింగ్‌ చెబుతున్నారు.

================================

పచ్చని ప్రకృతి ఒడిలో…
రిటైర్మెంట్‌ తరువాత చక్కగా వ్యవసాయం చేసుకుంటూ, వ్యవసాయ క్షేత్రంలోనే మంచి ఫాంహౌజ్‌ నిర్మించాలని అనుకొని, 20 ఎకరాల్లో వ్యవసాయ భూమి తీసుకున్నాను. చేను మద్యలోంచి వాగు పారుతుండటంతో చాలా మంది అంతగా ఆసక్తి చూపలేదు. నేను మాత్రం ఏరికోరి అదే భూమిని తీసుకున్నాను. అయితే వాగు చుట్టూ ఉన్న ప్రాంతంలో పంటలు వేసుకునే అవకాశం లేకపోవడంతో, వాగుపై బ్రిడ్జి కట్టి మొదట్లో చిన్న ఫోటో స్పాట్‌గా తయారు చేసాను. దీనికి మంచి స్పందన రావడంతో దశల వారీగా పనులు చేపట్టి, గులాబ్‌ సింగ్‌ ఫిల్మ్‌సిటీ పేరిట అభివృద్ధి చేసాను. ఇప్పుడు జనాల తాకిడి బాగా పెర్గింది. నా ఆలోచనను చాలా మంది ప్రశంసిస్తుంటే, నాకు చాలా సంతోషంగా ఉంది.

–గులాబ్‌ సింగ్, ఫౌండర్‌ అండ్‌ సీఈవో

================================

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *