సిరాన్యూస్, బేల
బహ్రెయిన్ నుండి ఖానాపూర్ కు చేరుకున్న నవీన్ మృతదేహం
అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు
ఎన్నారై పాలసీ జెండా కప్పి బాధిత కుటుంబాన్నీ ప్రభుత్వం ఆదుకోవాలి
* జీడబ్ల్యుఏసీ రాష్ట్ర అధ్యక్షులు షబ్బీర్ పాషా
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం చెందిన సుభాష్ నగర్ కు చెందిన నవీన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం మృతదేహం ఇంటికి చేరుకున్నది. మృతునికి భార్య, ఒక కుమారుడు తల్లి ఉన్నారు. కుటుంబ సభ్యుల బంధువుల రోధనలతో విషాదం నెలకొంది. మృతదేహం పై ఎన్నారై పాలసీ జెండా కప్పి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధ్యక్షులు షబ్బిర్ పాషా మాట్లాడుతూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల ను ఆదుకునే ఉద్దేశ్యం తో అన్ని సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఒక మంచి నిర్ణయం త్వరలో తీసుకుంటామని హమీ ఇవ్వడం శుభ పరిణమం అన్నారు. సమావేశం లో వారి సంస్థ తరవున వ్యవస్థపక అద్యక్షులు కృష్ణా దోనికేని పాల్గొన్నారని తెలిపారు. నవీన్ కుటుంబన్నీ ఆదుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల ఎక్స్ ఎక్సగ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వన్నీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారి ద్వారా తీసుకెళ్లి వారి కృషితో కుటుంబన్ని అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు.మృతదేహం ఇంటికి చేరడానికి బహ్రెయిన్ దేశం లో మా సంస్థ సభ్యులైన రాజేశ్వర్ పెద్ద భూమన్న డాక్టర్ భీమన్నలు తీవ్ర కృషి చేశారని అలాగే ఇక్కడి నుండి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారికంగా అన్నివిధాలుగా సహాకరించారన్నారు మృతుని ఇంటి వద్ద ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం కుటుంబ సభ్యులను ఓదార్చారు పల్లపు లక్ష్మణ్ ,అల్లెపు శంకర్,ఓర్సు తిరుపతి,వెంకటి,అమిరుద్దీన్ సాజిద్, కలీమ్,తదితరులు పాల్గొన్నారు.