gumpula: గుంపులలో శ్మ‌శాన‌వాటిక ధ్వంసం

సిరాన్యూస్, ఓదెల
గుంపులలో శ్మ‌శాన‌వాటిక ధ్వంసం

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీతో శ్మ‌శాన‌వాటిక ధ్వంసం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన ఈ వైకుంఠ ధామాన్ని దుండగులు ద్వంసం చేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది కూలీల శ్రమతో నిర్మించిన సుమారు 12 లక్షల రూపాయల విలువగల వైకుంఠధామం విధ్వంసానికి కారకులైన వ్యక్తులను విచారించి శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా వైకుంఠ ధామంలో ఆర్చిల నిర్మాణాన్ని దుండగులు కూలగొట్టారని , ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఓదెల ఎంపీడీవోను సంప్రదించగా గుంపుల గ్రామంలో జరిగిన వైకుంఠదామం కూల్చివేతపై తదుపరి చర్యలు నిమిత్తమై ఉన్నతాధికారులకు నివేదించామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *