సిరాన్యూస్,ఓదెల
చెరువును తలపిస్తున్న గుంపుల పాఠశాల
ఓదెల మండలం గుంపుల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో కెనాల్ నుండి వచ్చే నీరు చెత్తాచెదారంతో చెరువుల కనబడుతుంది. దీంతో పాఠశాల చుట్టూ వరద నీరు చేరడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రెండు అంగన్వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. మురుగునీటి వలన డెంగ్యూ దోమల వలన పిల్లలకు ప్రజలకు విష జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు తెలుపుతున్నారు. ప్రత్యేక అధికారులు గ్రామ కార్యదర్శి ఓదెల మండల విద్యాధికారి చొరవ తీసుకొని సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.