Gundeti Ailaiah Yadav: రైతుల కండ్ల‌లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

సిరాన్యూస్‌, ఓదెల
రైతుల కండ్ల‌లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
* మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్
* ఓదెలలో రైతుల సంబ‌రాలు

రైతుల కండ్ల‌లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమ‌ని పెద్దపెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామంలోని గురువారం సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి శ్రీధర్ బాబు , ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపెల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన కార్యక్రమం అని కొనియాడారు.దేశానికి అన్నం పెట్టే రైతున్న అప్పుల ఊబి నుండి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బహత్తర సాహసం రైతు రుణమాఫీ పథకం అని అన్నారు. ఈ ప్రాంత రైతన్నల కష్టాలు తీర్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్న పెద్దపెల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు రైతుల అందరం గుండెల్లో పెట్టి చూసుకుంటామని అన్నారు. రైతుల కండ్ల‌ ఆనందాన్ని నింపిన ఈ ప్రభుత్వానికి రైతుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షం సైతం లెక్క చేయకుండా రైతులు సంబరాలు చేసుకొని ఒకరికొకరు సీట్లు తినిపించుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు ఎడవెల్లి విజయపాల్ రెడ్డి , చింతిరెడ్డి విజేందర్ రెడ్డి , కాసారపు శ్రీనివాస్ , అమ్ముల బిక్షపతి , గుండేటి అశోక్ , గుండేటి సదయ్య , గాజుల ఉపేందర్ , బండి ప్రభకర్ ,గుండేటి వీరయ్య , ఈద కొమురయ్య , అటపెల్లి శంకరయ్య , బొమ్మ ఐలయ్య , ఈద ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *