సిరాన్యూస్,గుడిహత్నూర్
పిల్లలను పనిలో పెట్టకుండా బడిలో చేర్పించాలి: కళాజాత కోఆర్డినేటర్ గుంజాల రమేష్
* డోoగర్గావ్ లో బడిబాట కార్యక్రమం పై అవగాహన
పిల్లలను పనిలో పెట్టకుండా బడిలో చేర్పించాలని కళాజాత కోఆర్డినేటర్ గుంజాల రమేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో ని డోoగర్గావ్ గ్రామంలో కళాజాత కళాకారులూ పిల్లల్ని పనిలో పెట్టకుండా బడిలో చేర్పించాలని అవగాహనా కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండ హెల్మిట్ ధరించాలని పాటల ద్వారా ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో కళాజాత కోఆర్డినేటర్ గుంజాల రమేష్, టీమ్ లీడర్ చాకటి రవి, కళాకారులూ గట్టు వెంకట్రావు, గోవింద్రావు,రాజలింగు, మురళి,శంకర్, నగేష్, రాజు, ఉపాధ్యాయిలు కళ్యాణి, మడావి రాజకుమార్, అంగన్వాడీ చిక్టే నందాతాయి, బడి పిల్లలు, గ్రామస్తులు పాల్గొన్నారు.