సిరా న్యూస్, బోథ్
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి: ఆలయ కమిటీ చైర్మన్ జివి రమణ
* ఘనంగా జివి రమణ జన్మదిన వేడుకలు
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రామాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ జివి రమణ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా సోనాలలోని రామాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ జివి రమణ జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జన్మదిన సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటినట్లయితే పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు భావితరాలకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.