సిరాన్యూస్, ఓదెల
శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన హమాలి సంఘం నాయకులు
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని పెద్ద కొమిర గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం బాధిత కుటుంబాన్ని కొమిర గ్రామ హమాలి సంఘం నాయకులు పరామర్శించారు. అనంతరం రూ. 21 వేలురి కుటుంబానికి అందజేశారు. అలాగే గాజుల కుమార్ క్వింటాళ్ల బియ్యం,రూ. 2000 ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం హమాలి సంఘం వారు మాట్లాడుతూ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను దాతలు ఎవరైనా ఉంటే వారికి సహాయం చేయాలని వారు అన్నారు. హమాలి సంఘాన్ని గ్రామస్తులు పలువురు అభినందించారు.