Hanuman: హనుమాన్ స్వాముల ఆందోళన

సిరాన్యూస్, మంచిర్యాల‌
 హనుమాన్ స్వాముల ఆందోళన
* హనుమాన్ మాల ధరించి స్కూల్ కి వచ్చిన విద్యార్థులు
* పరీక్షకు అనుమతించని ప్రిన్సిపల్
* సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించిన డిసిపి
* రాస్తారోకో, స్కూల్ ముట్టడించిన రామదండు..

హనుమాన్ మాల‌దారణ గావించిన విద్యార్థులు పరీక్ష కోసం స్కూలుకు రావడంతో కాషాయ మాల వస్త్రాలను స్కూల్ ప్రిన్సిపాల్ జోబి తొలగించారు.దీంతో రామ భక్తులు స్కూల్ ను ముట్టడించి రాస్తారోకోతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి లో ఉన్న మథర్ థెరిస్సా స్కూల్ లో చోటుచేసుకుంది. స్కూల్లో 4వ తరగతి చదువుతున్న బంగారు దీవేన్, గొర్ల విద్యాదిత్య, హర్ష వర్ధన్ లు హనుమాన్ దీక్ష మాల ధరించి పరీక్ష రాయడానికి స్పీహోల్ కి రాగా ప్రిన్సిపల్ జోబి పరీక్ష గదికి అనుమతించగా దీక్ష మాలాధారణ వస్త్రాలను తొలగించి స్కూల్ యూనిఫామ్ దరింపజేశారు. మాల‌దారణ గావించిన బాల స్వాములకు అవమానం జరిగిందని ఆగ్రహించిన రామ భక్తులు వందల మంది పాఠశాల కు చేరుకుని నిరసనను చేపట్టారు. కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించి వందలాది హనుమాన్ దీక్ష పరులు పేరెంట్స్ తో కలిసి స్కూలును ముట్టడించి స్కూల్ ఆఫిస్ అద్దాలను ద్వసం చేశారు. సమాచారం అందుకున్న మంచిర్యాల డిసిపి మంచిర్యాల డివిజన్ లోని పోలీస్ అధికారులు, సిబ్బంది తో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి ఆందోళన ను విరమిపజేయా ప్రయత్నం చేశారు.స్కూల్ పర్మిషన్ రద్దు చేసి హిందూ మతాన్ని అవమానించిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని హనుమాన్ స్వాములు భీష్మించుకుని ఆందోళన ఉధృతం చేశారు.
చట్టం ప్రకారం చర్యలు…డిసిపి అశోక్ కుమార్
హనుమాన్ మాల ధరించి స్కూల్ కు వచ్చిన విద్యార్థులను మాల వస్త్రాలు విప్పించి స్కూల్ యూనిఫామ్ దరింప జేసిన ప్రిన్సిపాల్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, సున్నితమైన అంశం అయినందున ప్రిన్సిపాల్ తో బహిరంగ క్షమాపణ చెప్పించలేమని చట్టం ప్రకారం తాము నడుచుకుంటామని డిసిపి హామీ ఇచ్చి భక్తులను సముదాయించడంతో ఆందోళన విరమించారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల, శ్రీరాంపూర్, లక్షెట్టిపేట సీఐ లు , డివిజన్ లోని ఎస్ఐ లతో పాటు ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *