సిరా న్యూస్,నెల్లూరు;
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కావస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వేధింపులు మాత్రం కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం నీకు కొత్తపేటలో వైసిపి నాయకుల దౌర్జన్యాలకు తట్టుకోలేక ఐదు సంవత్సరాలు అనేక కుటుంబాలు ఊరి వదిలి పెట్టి వెళ్లిపోయరు. నలగట్ల పావని , నల్లగట్ల కోటమ్మ, నల్లగట్ల నాగేంద్ర లు వైసిపి నాయకులైన బొడ్డు మాధవరెడ్డి , జార్జ్ వేధింపులు తట్టుకోలేక గత కొద్ది రోజులుగా బయట తలదాచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి గ్రామానికి వచ్చిన వారిపై వైసిపి నేతల దౌర్జన్యం కొనసాగింది. తమకు జరుగుతున్న అన్యాయంపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాధవరెడ్డి,జార్జ్ వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ జిల్లా ఉన్నతాధికారులు కలుగ చేసుకుని తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు